Fire Accident: అగ్ని ప్రమాదం.. నాని కార్ సర్వీస్‌లో చెలరేగిన మంటలు
Fire Accident: అగ్నికి ఆహుతైపోయిన 10 కార్లు
Fire Accident: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీనాని కార్ సర్వీస్ సెంటర్‌లో మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున మంటలు అంటుకోవడంతో.. సర్వీస్ సెంటర్‌లో ఉన్న 10 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. పొగ వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది కంట్రోల్ చేశారు. అయితే.. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని కార్ సర్వీస్ సెంటర్ యజమాని తెలిపారు.