గాలిలో తేమ నుంచి తాగునీరు..!
ప్రతి జీవికి నిత్యావసరాలలో తాగు నీరు ముఖ్యమైనది. ఈ తాగు నీరు లేకపోయినట్లయితే సమస్థ జీవ కోటి మనుగడ ఆగిపోతుంది.
ప్రతి జీవికి నిత్యావసరాలలో తాగు నీరు ముఖ్యమైనది. ఈ తాగు నీరు లేకపోయినట్లయితే సమస్థ జీవ కోటి మనుగడ ఆగిపోతుంది. జీవకోటికి అవసరమయ్యే మంచినీటిని బోర్ల నుంచి వచ్చిన నీటిని ప్యూరిఫై చేసి తాగుతారు. ఇక బయటికి వెళ్లిన వారికి మంచి నీరు కావాలనుకున్న వారికి బాటిళ్లలో కొని తాగుతారు. అలాంటి బాటిళ్లలో అమ్మే నీరు సాధారణంగా బోర్ నీళ్లు ప్యూర్ ఫైర్ చేసి బాటిళ్లను నింపి అమ్ముతారు. కానీ ఇప్పుడు నూతన పద్ధతి ద్వారా నీటిని తయారు చేసి ప్రయాణికులకు అందజేస్తున్నారు. అది ఎలాగంటారా గాలిలో ఉన్నతేమ ద్వారా నీటిని తయారు చేస్తున్నారు. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉందికదా.
ప్రస్తుతం ఈ ప్రక్రియ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో నేటి నుంచి అందుబాటులోకి రానుంది. గాలిలోని తేమతో తాగునీటి అవసరాలు తీర్చే ప్రాజెక్టుకు దక్షిణ మధ్య రైల్వే శ్రీకారం చుట్టింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని ఒకటో నంబరు ప్లాట్‌ఫాంలో ఈ ప్లాంటును ఏర్పాటు రైల్వే శాఖవారు ఏర్పాటు చేశారు. పాంట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా ఈ రోజు ప్లాంటు ప్రారంభించనున్నారు. ఈ ప్లాంటు ద్వారా ప్రతి రోజు 1000 లీటర్ల నీరు ఉత్పత్తి చేసే అవకాశముందని ఆయన తెలిపారు. ఈ ప్లాంటు ద్వారా చాలా మందికి మంచి నీటిని సౌకర్యం కలగనుందని తెలిపారు.