Mahmood Ali: దేశంలో 24 గంటలు కరెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
Mahmood Ali: ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్, తాగు నీటి సమస్య తీవ్రంగా ఉండేది
Mahmood Ali: దేశంలో 24 గంటలు కరెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. మలక్ పేట అజాంపురా బీఆర్ఎస్ కార్యాలయంలో స్వాతంత్ర్య సమర యోధుడు స్వర్గీయ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మహమూద్ అలీ ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఉమ్మడి తెలంగాణలో రాష్ట్రంలో విద్యుత్, తాగు నీటి సమస్య తీవ్రంగా ఉండేదన్న..మహమూద్ అలీ తెలంగాణ వచ్చాక మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందిస్తున్నామన్నారు. కేసీఆర్ పాలనలో నగరంలో ఎలాంటి మత ఘర్షణలు లేవన్న ఆయన.. నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ ఇంచార్జి అజాం అలీతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.