Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య
Nagarkurnool: పెద్దలు తమ ప్రేమను అంగీకరించకపోవడంతో సూసైడ్...
Nagarkurnool: పురుగులమందు తాగి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన.. నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ లేడీస్ కార్నర్ షాపులో పనిచేస్తున్న యువకుడు అశ్వక్.. ఆ ఇంటి యజమాని కూతురిని ప్రేమించాడు. అయితే.. పెద్దలు తమ ప్రేమను అంగీకరించకపోవడంతో పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యలో అశ్వక్ చనిపోయాడు. నాగర్ కర్నూల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గోపిక కూడా మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.