తెలంగాణ కోర్టులకు లాక్‌డౌన్ పొడిగింపు

Update: 2020-08-11 12:53 GMT
తెలంగాణ హై కోర్టు ఫైల్ ఫోటో

Lock down extension Telangana courts : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు విస్తరిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కేసుల సంఖ్య అధికసంఖ్యలో నమోదవుతున్నాయి. అయితే కరోనా వైరస్ విజృంభిస్తున్న క్రమంలో తెలంగాణలోని అన్నికోర్టులకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ డౌన్ పిరియడ్ ని పెంచుతున్నట్టు తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలోని అన్ని కోర్టులు, ట్రైబ్యునళ్లకు లాక్‌డౌన్‌ను సెప్టెంబర్‌ 5 వరకు పొడిగిస్తున్నట్టుగా హైకోర్టు మంగళవారం ప్రకటించింది. ఇక పిటిషన్‌లను దాఖలు చేసుకోవాలనుకునే వారు ఆన్‌లైన్‌తో పాటు నేరుగా కోర్టులో కూడా దాఖలు చేసేందుకు అవకాశం ఉందని హైకోర్టు మంగళవారం నాటి ఉత్తర్వుల్లో వెల్లడించింది.

ఇక కోర్టులకు లాక్ డౌన్ విధించినప్పటి నుంచి అత్యవసర కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుపుతున్నారు. ప్రస్తుతం కూడా అత్యవసర కేసులను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరపాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వీడియో కాన్ఫరెన్స్ విధానంలోనే మరి కొద్ది రోజుల వరకు కోర్టులు విధులు నిర్వహించాలని హై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో మార్చి నుంచి హైకోర్టు సహా పలు కోర్టుల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1896 కరోనా కేసులు రికార్డయ్యాయి. కరోనాతో గత 24 గంటల్లో 10 మంది మృతి చెందారు. దీంతో మరణించిన వారి సంఖ్య 645కి చేరుకొంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు మంగళవారం నాటికి 82 వేలు దాటాయి.


Tags:    

Similar News