KTR: అనుముల తిరుపతి రెడ్డి గారు.. ఆ కిటుకేదో సామాన్యులకు కూడా చెప్పండి
KTR Tweet: సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి టార్గెట్‌గా కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
KTR Tweet: సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి టార్గెట్‌గా కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎల్‌కేజీ చదివే చిన్నారికి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదని, వారం ముందు గృహప్రవేశం చేసిన ఇల్లు... అన్ని కాగితాలున్నా పేక మేడలా కూల్చివేశారన్నారు. కానీ మీకు మాత్రం ఏకంగా 30 రోజుల సమయం ఇచ్చిందని చెప్పారు. ఈలోగా మీరు కోర్టులో స్టే సంపాదించుకున్నారని ఎక్స్ వేదికగా విమర్శించారు కేటీఆర్.
హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై కేటీఆర్ ఫైరయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల రావణకాష్టంలో మట్టి కూడా అంటనిది బహుశా మీకు మాత్రమేనా.. బుల్డొజర్ల కింద నలిగిపోతున్న సామాన్యులకు ఆ కిటుకు ఏదో చెప్పండి అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.