KTR: ఫోన్ ట్యాపింగ్ కాదు.. వాటర్ ట్యాపింగ్‌పై దృష్టి పెట్టండి
KTR: అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది
KTR: మిషన్ భగీరథ నిర్వహణ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదని కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్‌లో పదేళ్లుగా తాగునీటి కష్టాలు లేవని...కానీ, ప్రస్తుతం ఇక్కడ ట్యాంకర్ల దందా జోరుగా నడుస్తోందన్నారు. వేసవి ఆరంభంలోనే ఎద్దడి మొదలైందని..ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కొరత అని కేటీఆర్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌పై కాదు.. వాటర్ ట్యాపింగ్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. నాగార్జునసాగర్, సింగూరు, ఎల్లంపల్లి, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లో నీళ్లు ఉన్నాయని...చుట్టూ నీళ్లు ఉండగా హైదరాబాద్ వాసులు ఎందుకు కొంటున్నారని కేటీఆర్ ప్రశ్నించారు.