KTR: నా వ్యాఖ్యల వల్ల మనస్తాపం కలిగితే.. విచారం వ్యక్తం చేస్తున్నా

KTR Comments On Free Bus: మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Update: 2024-08-16 05:11 GMT

KTR: నా వ్యాఖ్యల వల్ల మనస్తాపం కలిగితే.. విచారం వ్యక్తం చేస్తున్నా..

KTR Comments On Free Bus: మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చింది. బస్సుల్లో మహిళలు బ్రేక్ డ్యాన్స్‌లు, రికార్డింగ్ డ్యాన్స్‌లు చేసినా అభ్యంతరం లేదంటూ.. కేటీఆర్ అవహేళనగా మాట్లాడారంటూ కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. మహిళా లోకానికి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మహిళల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. దీనిపై విచారణ జరపాలని ఆదేశించింది. ఆయన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని కమిషన్ ఛైర్‌పర్సన్‌ చెప్పారు.

అయితే కేటీఆర్ తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే.. విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు. అక్కా చెల్లెమ్మలను కించపర్చే ఉద్దేశం ఎప్పుడూ లేదన్నారు.


Tags:    

Similar News