Konda Sangeetha Reddy: శేరిలింగంపల్లిలో కొండా సంగీతరెడ్డి ప్రచారం
Konda Sangeetha Reddy: హైదరాబాదీలంతా బీజెపీ వెంటే ఉన్నారు
Konda Sangeetha Reddy: హైదరాబాద్ ప్రజలందరూ బీజేపీ వెంటే ఉన్నారన్నారు కొండా సంగీత రెడ్డి. చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపుని కాంక్షిస్తూ ఆమె శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని రామ్‌నరేష్ నగర్, మయూరి నగర్, మీనాక్షి స్కైలాంచ్, ఆదిత్య సన్ షైన్, అపర్ణ టవర్స్ తదితర గేటెడ్ కమ్యూనిటీలో బీజేపీ తరఫున కొండా సంగీత రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. దేశాభివృద్ధి కోసం ప్రధాని మోడీ చేపట్టిన కార్యక్రమాలన్ని దేశ ప్రజలను సంతృప్తి పరిచాయన్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలోని గేటెడ్ కమ్యూనిటీస్ అసోసియేషన్ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి జై కొట్టింది.