Kishan Reddy: మూసీ వెంట నివాసం ఉంటా.. రేవంత్ సవాల్ ను స్వీకరించిన కిషన్ రెడ్డి

మూసీ వెంట నివాసం ఉండేందుకు సిద్దంగా ఉన్నామని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరించేందుకు సిధ్దమన్నారు.

Update: 2024-10-25 09:34 GMT

Kishan Reddy: మూసీ వెంట నివాసం ఉంటా.. రేవంత్ సవాల్ ను స్వీకరించిన కిషన్ రెడ్డి

మూసీ వెంట నివాసం ఉండేందుకు సిద్దంగా ఉన్నామని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరించేందుకు సిధ్దమన్నారు. శుక్రవారం ఇందిరా పార్క్ వద్ద మూసీ బాధితులకు మద్దతుగా బీజేపీ ఆందోళన నిర్వహించింది. ఈ ఆందోళనలో ఆయన మాట్లాడారు. పేదల ఇళ్లు కూల్చేస్తే చూస్తూ ఊరుకోం.. అవసరమైతే చంచల్ గూడ జైలుకైనా వెల్తామని ఆయన చెప్పారు. మూసీని ఆనుకుని ఉన్న పేదల బాధలను అర్ధం చేసుకోవాలని ఆయన సీఎం ను కోరారు.పేదల బాధలు సీఎంకు ఏం తెలుసని ఆయన ప్రశ్నించారు. వాసన వస్తుందని ఇళ్లు ఖాళీ చేస్తామని ఎవరైనా చెప్పారా అని ఆయన అడిగారు.

రేవంత్​ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తి కావస్తుంది. ఈ 10 నెలల్లో ఒక్క పేదవారి ఇంటికి శంకుస్థాపన చేయకుండా తమ రక్తాన్ని చెమటగా మార్చి ఇటుకమీద ఇటుకపేర్చి నిర్మాణం చేసుకున్న పేదల ఇళ్లను కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలలుగా పేదలంతా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరందరికీ బీజేపీ అండగా నిలవాలని నిర్ణయించిందన్నారు. దేశంలో, రాష్​ర్టంలో, నగరంలో పేదవాడికి ఇబ్బంది వస్తే, మోదీ ఆదేశాలతో అండగా నిలబడతామని మంత్రి కిషన్​ రెడ్డి హామీ ఇచ్చారు.

అనేక హమీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని... కానీ, ఇప్పుడేమో ఆ హామీలను తుంగలోతొక్కిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ బాటలోనే నడుస్తుందని ఆయన చెప్పారు. మూసీ ప్రాంతంలో నివసిస్తున్న పేద ప్రజలకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నామన్నారు. మూసీ ప్రక్షాళనకు, సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదన్నారు. కానీ పేద ప్రజల ఇళ్ల జోలికి వస్తే బీజేపీ అడ్డుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు.

మూసీకి రెండు వైపులా రిటైనింగ్​ వాల్​ నిర్మాణం చేపట్టి సుందరీకరణ చేపట్టాలని ఆయన కోరారు.అనేక సంవత్సరాల నుంచి ఉన్న ఇళ్లను ఏ రకంగా కూలుస్తారని ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రాంతం చరిత్ర సీఎం రేవంత్​ రెడ్డికి తెలుసా? అని ప్రశ్నించారు.

మూసీలో అనేక ప్రాంతాల నుంచి డ్రైనేజీ నీరు కలుస్తుందన్నారు.దాన్ని డైవర్ట్​ చేయకుండా మూసీ ప్రక్షాళన చేయలేరని కేంద్ర మంత్రి చెప్పారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్​, మల్కాజ్​ గిరి ఎంపీ ఈటెల రాజేందర్​, ఆదిలాబాద్ ఎంపీ గూడెం నగేష్​, ఆదిలాబాద్​ ఎమ్మెల్యే పాయల్​ శంకర్​, ఆర్మూర్​ శాసనసభ్యులు పైడి రాజేశ్వర్​ రెడ్డి, కామారెడ్డి శాసనసభ్యులు కోటిపల్లి వెంకటరమణారెడ్డి, నిజామాబాద్​ ఎమ్మెల్యే సూర్యనారాయణ, ఆసిఫాబాద్​ ఎమ్మెల్యే హరీష్​, మాజీ ఎమ్మెల్యేలు, మూసీబాధితులు,పాల్గొన్నారు.

Full View


Tags:    

Similar News