Nirmal District: బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించిన కిరణ్‌ కొమ్రేవార్

Nirmal District: మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరనున్న కిరణ్

Update: 2023-11-07 09:06 GMT

Nirmal District: బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించిన కిరణ్‌ కొమ్రేవార్

Nirmal District: నిర్మల్ జిల్లా కాంగ్రెస్‌లో సీట్ల లొల్లి కొనసాగుతుంది. ముధోల్ కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. ముధోల్ టికెట్ కిరణ్ కొమ్రేవార్ ఆశించి భంగపడ్డారు. కిరణ్ కొమ్రేవార్‌కు టికెట్ కేటాయించకపోవడంతో కాంగ్రెస్ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలను కార్యకర్తలు కాల్చి వేశారు. కాంగ్రెస్ పార్టీకి తనకు అన్యాయం చేసిందని కిరణ్ కొమ్రేవార్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడ్డ తనను కాదని కొత్త పార్టీలోకి వచ్చిన నారాయణ్‌రావ్ పటేల్‌కు ఇవ్వడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో కిరణ్ కొమ్రేవార్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో కిరణ్ కొమ్రేవార్ గులాబీ కండువా కప్పుకోనున్నారు.

Tags:    

Similar News