Revanth Reddy: ఈ ఎన్నికలు రాష్ట్ర ముఖచిత్రాన్ని మారుస్తుంది
Revanth Reddy: ఈ ఎన్నికలు కొడంగల్-కేసీఆర్‌కు మధ్య జరుగుతున్నాయి
Revanth Reddy: పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ఈనెల 30న జరిగే ఎన్నికలు రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చేవిగా నిలుస్తాయని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. ఈ ఎన్నికలు కొడంగల్-కేసీఆర్‌కు మధ్య జరుగుతున్నాయని ఆయన అన్నారు. కొడంగల్ ప్రజలకు గొప్ప అవకాశం వచ్చిందన్నారు. కొడంగల్ ప్రజలు రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం వచ్చిందన్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన అన్నారు. కృష్ణా జలాలు తీసుకొచ్చి ఈ ప్రాంత కాళ్లు కడుగుతానని చెప్పి కేసీఆర్ మాట తప్పారని రేవంత్‌రెడ్డి విమర్శించారు.