KCR: నేడు కొండగట్టుకు సీఎం కేసీఆర్
KCR: అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న సీఎం
KCR: సీఎం కేసీఆర్ ఇవాళ కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శనం చేసుకోనున్నారు కొండగట్టు ఆలయ అభివృద్ధి పనుల కోసం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు ఇంతకీ వంద కోట్ల నిదులతో కొండగట్టులో జరగబోయే అభివృద్ధి పనులేంటి? భక్తులు కోరుకుంటున్నదేంటి?
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇటీవల వంద కోట్ల రూపాయలు కేటాయిస్తూ జీవో జారీ చేసింది ఎన్నో ఏళ్లుగా కొండగట్టు అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్న భక్తులు ఈ జీవోతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిధులు కేటాయిస్తూ జీవో ఇవ్వడమే ఆలస్యం ఆలయ అభివృద్ధి పనులు ఎలా చేయాలి ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది యాదాద్రి నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఆర్కిటిక్ ఆనంద్‌సాయిని హుటాహుటిన కొండగట్టుకు వెళ్లాలని పురమాయించిన కేసీఆర్. ఆలయంపై పూర్తి నివేదిక తెప్పించుకున్నారు.
ఈ నివేదిక ఆధారంగా ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టు ఆలయాన్ని పరిశీలించనున్నారు ఇవాళ ఉదయం కొండగట్టు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ ఆవరణతో సహా చుట్టూ ఉన్న ప్రాంతాల్లో మొత్తం స్తపతి ఆనంద్ సాయితోపాటు కలియ తిరగనున్నారు సీఎం ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయంలో చేయాల్సిన మార్పులు చేర్పులతో పాటు ఆలయ ఆవరణలో భక్తుల సౌకర్యార్థం చేయనున్న అభివృద్ధి పనులపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది ఆలయ పరిశీలన తరువాత అధికారులతో స్వల్పకాలిక సమీక్ష నిర్వహించనున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.
రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి కొండగట్టులో పర్యటించారు కొండగట్టులో 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంలో సీఎం ఉన్నట్టు ప్రకటించారు ఇక వీటితో పాటుగా ఘాట్ రోడ్ల అభివృద్ధి ఆలయ ఆవరణలో గ్రీనరీ, భక్తులకు పార్కింగ్ నూతన కాటేజీల నిర్మాణం నడకదారి అభివృద్ధి లాంటి పనులు చేయాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. వీటితో పాటు ఆలయ ప్రాకారాల సుందరీకరణ, గర్భగుడి విస్తరణ లాంటి పనులు కూడా చేయాలన్నది స్థానికులు, భక్తుల కోరుతున్నారు.
యాదాద్రి తరహాలో కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ప్రస్తుతానికి కొండగట్టుకు కేటాయించిన నిధులు కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే యాదాద్రి తరహాలో ఈ ఆలయం రూపుదిద్దుకోవాలంటే భారీ ఎత్తున నిధులు కావాల్సి ఉంటుంది భక్తుల కోరికలు ఆలయ అవసరాలను బట్టి సీఎం మరిన్ని నిధులు కేటాయిస్తారా? లేదా? విడతల వారీగా పనులు చేపడతామంటూ చెబుతారా? అనేది ఉత్కంఠగా మారింది ఏదేమైనా ఎన్నో ఏళ్లుగా ఎదరుచూస్తున్న కొండగట్టు అభివృద్ధి పనులకు మోక్షం రావడంతో అంజన్న భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.