KCR: ఎక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్.. కరెంట్ సమస్యపై కేసీఆర్ ట్వీట్
KCR: శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తుండగా.. రెండు సార్లు కరెంట్ పోయిందన్న కేసీఆర్
KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఎక్స్‌లో ఖాతా తెరిచి.. సామాజిక మాధ్యమం ద్వారా మరింత చేరువయ్యారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ పేరుతో ట్విటర్ ఖాతా ఉంది. తాజాగా కేసీఆర్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ పేరుతో ‘ఎక్స్’ ఖాతా ప్రారంభించారు. సామాజిక మాధ్యమం ద్వారా తమ అభిమాన నేత అందుబాటులోకి రావడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తెలంగాణరాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కేసీఆర్ మొదటి పోస్టు చేశారు.
ఇక కరెంట్ సమస్యపై రెండో పోస్టు చేశారు కేసీఆర్. తాను గంట క్రితం మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంటు పోయిందని కేటీఆర్ పోస్టు చేశారు. ప్రతి రోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కరెంటు పోవడం లేదని ఊదర గొడుతున్నారని విమర్శలు గుప్పించారు. తనతోపాటు ఉన్న మాజీ శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో రోజుకు పదిసార్లు కరెంటు పోతుందని ఈ సందర్భంగా తనతో చెప్పారని కేసీఆర్ వివరించారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది? అంటూ కేసీఆర్ ట్వీట్ చేశారు.