KCR: ఇవాళ నాలుగు నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచారం
KCR: మరో రెండురోజుల్లో ముగియనున్న ఎన్నికల ప్రచారం
KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. మరో రెండురోజుల్లో ఎన్నికల ప్రచారానికి గడువు ముగుస్తుండటంతో దూకుడు పెంచారు గులాబీ బాస్. ఇవాళ ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాకలో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. తొలుత ఖానాపూర్‌లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్‌ఎస్ అధినేత హాజరవుతారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఖానాపూర్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ విజయం కోసం ప్రచారం చేస్తారు. అనంతరం జగిత్యాలకు చేరుకుంటారు.
జిల్లా కేంద్రంలోని గీతా విద్యాలయం గ్రౌండ్‌లో నిర్వహించనున్న ప్రజా ఆశ్వీరాద సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభ అనంతరం వేములవాడ బయల్దేరుతారు. 3 గంటలకు వేములవాడ కోర్టు సమీపంలోని మైదానంలో ప్రజా ఆశ్వీరాద సభలో పాల్గొంటారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావుకు మద్దతుగా ప్రచారం చేస్తారు. చివరగా సాయంత్రం 4 గంటలకు దుబ్బాక నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొంటారు.