CM KCR: టార్గెట్ హ్యాట్రిక్.. ఒకే రోజు నాలుగు ప్రచార సభలకు కేసీఆర్
CM KCR: మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్‌చెరులో సభలు
CM KCR: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్అధినేత, సీఎం కేసీఆర్ దూసుకుపోతున్నారు. ఇవాళ 4 చోట్ల బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలలో పాల్గొననున్నారు. మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్‌చెరులోని ప్రజా ఆశీర్వాదసభలో కేసీఆర్ పాల్గొంటారు.
మూడోసారి అధికారమే లక్ష్యంగా గులాబీదళం రాష్ట్రంలో ప్రచారాలతో హోరెత్తిస్తోంది. ఓ వైపు అభ్యర్థులు, రాష్ట్ర స్థాయి నేతలు నియోజకవర్గాల్లో పర్యటిస్తుండగా..అటు అధినేత రోజుకు రెండు మూడు బహిరంగ సభలకు హాజరవుతూ..పార్టీ అభ్యర్థులకు మద్దతివ్వాలని కోరుతున్నారు. బీఆర్ఎస్అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించనున్న ప్రజాఆశీర్వాద బహిరంగ సభలకు గులాబీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశాయి. సీఎం కేసీఆర్ పాల్గొనే 2 బహిరంగసభలకు పోలీసుశాఖ భారీబందోబస్తు ఏర్పాటు చేసింది.