ఒకే ఒక్కడు.. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం.. తెలంగాణ సాధన కోసం తీవ్రంగా పోరాటం చేసిన కేసీఆర్..

CM KCR : *రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన పార్టీ టీఆర్ఎస్ *2001లో టీఆర్ఎస్‌ను స్థాపించిన కేసీఆర్

Update: 2023-11-11 04:23 GMT

CM KCR : ఒకే ఒక్కడు.. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం.. తెలంగాణ సాధన కోసం తీవ్రంగా పోరాటం చేసిన కేసీఆర్.. 

CM KCR : రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం అయితే నాయకులు ఒక పార్టీలో టికెట్ రాకపోతే మరొక పార్టీలోకి జంప్ కావడం లేకపోతే కొత్త రాజకీయ పార్టీ స్థాపించి అందరికీ టికెట్లు ఇవ్వడం పరిపాటిగా జరుగుతుంది. కానీ ఒక పార్టీ కేవలం రాష్ట్రాన్ని సాధించడం కోసం పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రెండు సార్లు అధికారంలో కూడా వచ్చింది..

తెలంగాణ రాష్ట్ర సమితి ఈ పార్టీ మూడున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్ష లు నెరవేర్చడం కోసమే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 2001 పార్టీని స్థాపించారు. రాష్ట్రంలో చాలా పార్టీలు వేరు వేరు ఆలోచనలతో బయటికి వచ్చిన కేవలం కేసీఆర్ ఒక్కడే తాను అనుకున్న తెలంగాణ సాధించాడు. అదే పార్టీతో ప్రస్తుతం రెండు సార్లు అధికారంలోకి వచ్చాడు. ముచ్చటగా మూడో సారి కోసం ప్రయత్నం చేస్తున్నాడు.

నిజానికి రాజకీయ పార్టీ లు పెట్టడం వాటిని నడిపించడం అంత ఆషామాషీ విషయం కాదు. రోజు వారి రాజకీయ కార్యాచరణ,పార్టీ నిర్మాణం,ఎన్నికలలో పోటీలు,ఇలా ప్రతిదీ చాలా ఖర్చు తో కూడుకున్న పని కొన్ని సార్లు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉన్న ఆ పార్టీకి సరైన నాయకుడు లేకపోతే పార్టీలు గట్టెక్కడం అంత ఈజీ కాదు. గతంలో చాలా పార్టీలు పుట్టుకొచ్చిన కొద్ది రోజులకే అ పార్టీలు మిగతా పార్టీలలో విలీనం అయ్యాయి.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఒక్కడే పట్టువీడని విక్రమార్కుడిగా పోరాటం సాగించాడు. తెలంగాణ కోసం చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి లాంటి మహనేతలను ఢీకొట్టి విజయం సాధించాడు. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి ముచ్చటగా మూడోసారి అధికారమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు.

Tags:    

Similar News