KCR: ఈ నెల 24 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర
KCR: మిర్యాలగూడ నుంచి రోడ్ షో ప్రారంభం
KCR: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం హోరెత్తించనున్నారు. ఇందులో భాగంగా రాష్ర్ట వ్యాప్తంగా బస్సు యాత్ర, రోడ్ షోలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. బస్సు యాత్రకు షెడ్యూల్ ఖరారు చేశారు. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ కేసీఆర్ ప్రచారం ఉండేలా బస్సు యాత్ర రూట్ మ్యాప్ రూపొందించారు. ఈనెల 24న నల్లగొండ లోక్ సభ నియోజక వర్గం పరిధిలోని మిర్యాలగూడలో బస్సు యాత్ర ప్రారంభం కానున్నది. ప్రతి నియోజక వర్గంలోనూ స్థానిక నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. సాయంత్రం వేళల్లో కనీసం రెండు మూడు ప్రాంతాల్లో రోడ్ షోల్లో కేసీఆర్ పాల్గొంటారు. ప్రజలనుద్దేశించి కార్నర్ మీటింగ్ లలో ప్రసంగించనున్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఇళ్లలోనే కేసీఆర్ తో పాటు పార్టీ నేతలు బస చేస్తారు. మే 10వ తేదీన సిద్దిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ నెల 24 నుంచి బస్సు యాత్ర మే 10 వరకు బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఈనెల 24న మిర్యాలగూడ, సూర్యాపేటలో బస్సు యాత్ర చేపట్టనున్నారు. 25న భువనగిరిలో, 26న మహబూబ్ నగర్, 27 నాగర్ కర్నూలులో , 28న వరంగల్ లో , 29న ఖమ్మంలో, 30 న తల్లాడ, కొత్తగూడెంలో, మే ఒకటిన మహబూబాబాద్ లో, 2న జమ్మికుంటలో, 3న రామగుండంలో, 4న మంచిర్యాలలో, 5న జగిత్యాలలో, 6న నిజామాబాద్ లో, 7న కామారెడ్డి, మెదక్ లో, 8వ తేదీన నర్సాపూర్, పటాన్ చెరులలో, 9వ తేదీన కరీంనగర్, 10వ తేదీన సిరిసిల్లలో రోడ్ షోలో నిర్వహించనున్నారు. చివరగా మే 10వ తేదీన సిద్దిపేటలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.