Kaleshwaram Commission: ముగిసిన కాళేశ్వరం కమిషన్ విచారణ
Kaleshwaram Commission: కమిషన్ ఎదుట హాజరైన అప్పారావు, పద్మావతి, మణిభూషణ్ శర్మ
Kaleshwaram Commission: కాళేశ్వరంపై కమిషన్ విచారణ కొనసాగుతోంది. బుధవారం నాటి విచారణకు కాళేశ్వరం కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకట అప్పారావు, ఇరిగేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పద్మావతి, వర్క్స్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ మణిభూషణ్ శర్మ హాజరయ్యారు. అధికారులపై కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. ఏ ప్రాతిపదికన లోన్లు తీసుకుంటారని కమిషన్ ప్రశ్నించింది. ప్రభుత్వ అప్రూవల్‌తోనే కార్పొరేషన్ లోన్‌కు వెళ్తుందని అధికారుల కమిషన్‌కు తెలిపారు.
నాబార్డ్ నుంచి అప్పులు తీసుకున్నామని వెంకట అప్పారావు తెలిపారు. పెద్ద మొత్తంలో లోన్లు తీసుకోవడానికి మీ వద్ద ఉన్న ఆస్తులు ఏంటని పిసి ఘోష్ ప్రశ్నించారు. రామగుండం NTPCకి నీళ్లను సరఫరా చేయడం ద్వారా..వచ్చే ఆదాయంతోనే మెయింటెనెన్స్ చేస్తామని ఆఫీసర్ల వివరణ ఇచ్చారు. ప్రాజెక్టు ప్లానింగ్ ముందే లోన్ తీసుకోవాలనుకున్నారా పీసీ ఘోష్ ప్రశ్నించారు.
ప్రభుత్వం ఎలాంటి కేటాయింపులు చేయలేదని పద్మావతి తెలిపారు. మీరు తీసుకున్న అప్పుల్ని బడ్జెట్లో చూపించారా అని ప్రశ్నించిన కమిషన్ బడ్జెట్లో చూపించలేదని పద్మావతి తెలిపారు. కమిషన్ ప్రశ్నలకు తన పరిధిలో లేని అంశాలని భూషణ్ శర్మ దాట వేశారు. మూడు బ్యారేజీల ఎస్టిమేషన్స్‌ను ముందే ఆడిట్ చేశామని వివరణ ఇచ్చారు. కాగ్ రిపోర్టుతో తమకు సంబంధం లేదని కమిషన్‌కు అధికారులు వివరించారు.