Power Purchase: కేసీఆర్ లేఖపై నేడు జస్టిస్ నరసింహారెడ్డి సమీక్ష
Power Purchase: పవర్ కమిషన్ విచారకు సంబంధించి కేసీఆర్ పంపిన లేఖపై పవర్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఈరోజు సమీక్ష చేపట్టనున్నారు.
Power Purchase: పవర్ కమిషన్ విచారకు సంబంధించి కేసీఆర్ పంపిన లేఖపై పవర్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఈరోజు సమీక్ష చేపట్టనున్నారు. కేసీఆర్ పంపించిన లెటర్ కమిషన్ కి అందిందని పలు అంశాలను ప్రస్తావించారని తెలిపింది. ఛత్తీస్‌గఢ్ పవర్ పర్చేస్, భద్రాద్రి యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ అంశాల్లోని కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారన్న కమిషన్ కేసీఆర్ చెప్పిన విషయాలను నిపుణుల కమిటీతో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కాగా మొన్న నిర్వహించిన ప్రెస్‌మీట్‌లోనే ఎవరికైనా తమ అభిప్రాయాలు ఉంటాయని వాటిని నిస్సందేహంగా చెప్పే స్వేచ్ఛ ఉంటుందని ఇప్పటికే ఛైర్మన్ తెలిపారు.
కేసీఆర్ కమిషన్‌కు పంపిన లేఖలో కేసీఆర్ చెప్పిన వివరాలకు వాస్తవాలకు సరిపోల్చాల్సి ఉంటుందని కమిషన్ అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వాస్తవాలపై BHEL ప్రతినిధులని కూడా వివరాలు అడుగనున్న కమిషన్ నేడు చర్చ అనంతరం దాని అనుగుణంగానే తదుపరి చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తుంది. కాగా కాసేపట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో విద్యుత్ ఒప్పందాలలో జరిగిన అవకతవకలపై విచారణ కొనసాగుతోంది. ఈ విచారణకు జనసమితి అధినేత కోదండరామ్, విద్యుత్ ఉన్నతాధికారి రఘులు కమిషన్ ముందు హాజరుకానున్నారు.