వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ
Vemulawada: దర్శనానికి నాలుగు గంటల సమయం
Vemulawada: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్పెషల్ దర్శనం, శీఘ్ర దర్శనం క్యూ లైన్లు పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. వేకువజాము నుంచే భక్తులు తలనీలాలు సమర్పించి, ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరింస్తున్నారు. స్వామి వారి దర్శనానికి దాదాపు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతోంది. పిల్లలకు స్కూల్ హాలిడేస్ కావడంతో.. భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగాకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.