భారీగా పెరిగిన వంట నూనెల ధరలు

Sangareddy: ఉక్రెయిన్ యుద్ధాన్ని బూచిగా చూపి.. ధరలు పెంచేసి అమ్ముతున్న దుకాణాదారులు

Update: 2022-03-18 04:54 GMT

భారీగా పెరిగిన వంట నూనెల ధరలు

Sangareddy: ఉక్రెయిన్ యుద్ధాన్ని బూచిగా చూపి వంట నూనెల ధరలను అమాంతం పెంచేసి వినియోగదారులను దోపిడీ చేస్తున్నారు కొందరు దుకాణాదారులు. ఎమ్మార్పీ ధరలపై స్టిక్కర్లు అతికించి మరీ దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ దోపిడీ అరికట్టాల్సిన తూనికలు కొలతల అధికారులు టూర్ల పేరుతో తప్పించుకు తిరుగుతున్నారు.

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వంట నూనెల ధరలు పెంచారు వ్యాపారులు. తూనికలు కొలతల అధికారుల నిర్లక్ష్యంతో దుకాణదారుల దోపిడి ప్రారంభించారు. ఉక్రెయిన్ యుద్ధం సాకుగా చూపి లీటర్ ప్యాకెట్ పై ఎమ్మార్పీ కన్నా 50 రూపాయలు వరకు పెంచి అమ్ముతున్నారు. దీంతో మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉక్రెయిన్ యుద్ధం సాకుగా చూపి సంగారెడ్డిలో వ్యాపారులు వంట నూనెల ధరలు ఒక్కసారిగా పెంచేశారు. దీంతో పెరిగిన ధరలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రధానంగా మధ్యతరగతి మహిళలు ఆందోళన చెందుతున్నారు. సన్‌ఫ్లవర్‌ నూనె లీటర్‌ ధర రిటైల్‌ మార్కెట్‌లో ఎమ్మార్పీ 157 రూపాయలు ఉండగా.. దుకాణాల్లో 190 నుండి 211 రుపాయల వరకు ధర పెంచి అమ్ముతున్నారు. ఎమ్మార్పీ 155 ఉండగా రెండు వందలు ఎందుకు అమ్ముతున్నారని కస్టమర్లు అడిగితే దీనికంతటికీ కారణం ఉక్రెయిన్‌పై రష్యా చేపడుతున్న యుద్ధమే కారణమని షాపుల ఓనర్లు చెబుతున్నారు.

వంట నూనె ధరలు విపరీతంగా పెరగడంతో.. షాప్‌నకు వచ్చి మరీ కొనకుండా వెనుదిరుగుతున్నారని దుకాణాదారులు చెబుతున్నారు. రేట్లు పెంచి అమ్ముతున్నా తూనికలు కొలతల శాఖ అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఫిర్యాదులు అందుతున్నా ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆ శాఖ కార్యాలయం ఉన్న పరిసర ప్రాంతంలోని దుకాణాల్లోనే రేట్లు పెంచి అమ్ముతున్నా తమ దృష్టికి రాలేదంటూ తప్పించుకుంటున్నారనే విమర్శలున్నాయి. 

Tags:    

Similar News