మంత్రి జగదీశ్‌రెడ్డి పీఏ ఇంటిపై ఐటీ దాడులు.. నగదు స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం

Nalgonda: తెలంగాణ మంత్రి జగదీశ్‌ రెడ్డి పీఏ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోదాలు చేపట్టారు

Update: 2022-11-01 01:05 GMT
Income Tax Raids On Telangana Minister Jagadish Reddy PA house in Nalgonda

మంత్రి జగదీశ్‌రెడ్డి పీఏ ఇంటిపై ఐటీ దాడులు.. నగదు స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం

  • whatsapp icon

Nalgonda: తెలంగాణ మంత్రి జగదీశ్‌ రెడ్డి పీఏ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోదాలు చేపట్టారు. నల్గొండ పట్టణంలోని తిరుమలనగర్‌లో ఉన్న ఆయన నివాసంలో సోమవారం సాయంత్ర 6 గంటల నుంచి దాదాపు రాత్రి 10.30 సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో ఇంటి బయట ఉన్న ప్రభాకర్‌రెడ్డిని, ఆయన మిత్రులను పిలిచి విచారించారు. దాడులు పూర్తయిన అనంతరం వివరాలు వెల్లడించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రభాకర్‌రెడ్డి ఇంటి నుంచి చీజ్‌ చేసిన ఓ బ్రీఫ్‌కేసును తీసుకెళ్తున్నట్లు మీడియా కంటపడింది. తెలంగాణ ఆదాయపు పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News