Wine Shops: అర్థరాత్రి ఒంటిగంట వరకు హోటళ్లు, రెస్టారెంట్లు..సర్కార్ ఉత్తర్వులు జారీ

Business Hours Revised in Hyderabad: హైదరాబాద్ లో వ్యాపారులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. వారి పనివేళలను మారుస్తూ సర్కార్ ఉత్తర్వులను జారీ చేసింది.

Update: 2024-09-25 03:24 GMT

Wine Shops: అర్థరాత్రి ఒంటిగంట వరకు హోటళ్లు, రెస్టారెంట్లు..సర్కార్ ఉత్తర్వులు జారీ

Business Hours Revised in Hyderabad: హైదరాబాద్ లో వ్యాపారులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. వారి పనివేళలను మారుస్తూ సర్కార్ ఉత్తర్వులను జారీ చేసింది.

హైదరాబాద్ పరిధిలో వ్యాపారాలు నిర్వహించే సముదాయాలు బార్లు, రెస్టారెంటర్లు, కాఫీ, పాన్ షాపుల పనివేళలను ఇక నుంచి అర్థరాత్రి ఒంటిగంట వరకు నిర్వహించుకోవచ్చని సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సూపర్ మార్కెట్లు, బంగారు షాపులు, ఇతర కిరాణ దుకాణాలను ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే నిర్వహించుకోవచ్చు. దీనికి సంబంధించి మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది ప్రభుత్వం.

వైన్స్ లిక్కర్ అవుట్ లెట్స్ జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే షాపులు సమయాన్ని కూడా పొడిగించారు. ఈ దుకాణాలను ఉదయం 10గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిర్వహించుకోవచ్చని తెలిపింది. జీహెచ్ఎంసీకి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న దుకాణాల నిర్వహణ వేళలు కూడా పెంచింది. వారంతరంలో శనివారం, ఆదివారం తప్ప మిగతా రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి అర్థరాత్రి 12గంటల వరకు ఓపెన్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఇక వీకెండ్ లో అయితే ఉదయం 10గంటల నుంచి అర్థరాత్రి 1 వరకు ఓపెన్ చేసుకోవచ్చు.

ఇక ఫుడ్ వ్యాపారులు ముఖ్యంగా హోటల్లు, రెస్టారెంట్లు ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12గంటల వరకు పొడిగించింది. ఇందులో హోటళ్లు, రెస్టారెంట్లు, ధామా, ఐస్ క్రీమ్ పార్లర్, బేకరీ , టిఫిన్ సెంటర్లు, కాఫీ షాపులు, టీ స్టాళ్లు, పాన్ షాపులు అర్థరాత్రి ఒంటిగంటకు వరకు నిర్వహించుకునే అవకాశం కల్పించింది.

అయితే ఈ ఆర్డర్లు డీసీపీ, ఏసీపీ, ఎస్ హెచ్ఓల ఆధ్వర్యంలో ఉంటాయి. అయితే నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. 

Tags:    

Similar News