Rain Alert: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్..మూడురోజులు భారీ వర్షాలు

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. నిన్న శుక్రవారం ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్ర, మధ్య తెలంగాణ, హైదరాబాద్ లోనూ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నేడు వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం.

Update: 2024-09-21 04:08 GMT

తెలంగాణ, ఏపీలకు మరోసారి భారీ వర్ష సూచన అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఈశాన్య రుతుపవనాల రాక మొదలవుతున్నట్లే. నేడు అండమాన్ సముద్రంపై ఒక గాలి సుడిగుండం ఏర్పడే అవకాశం ఉంది. ఇది వాయువ్య దిగా కదులుతుంది. ఈ ప్రభావం వల్ల పశ్చిమ మధ్య వాయవ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 23 నాటికి అల్పపీడేందుకు కీలకం కానుంది. ఈ పరిస్థితుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులపాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయి.

నేడు ఉదయం 8 గంటల వరకు ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, హైదరాబాద్ పరిసరాలు, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు రోజంతా తెలుగు రాష్ట్రాలపై మేఘాలు ఉంటాయి. రాయలసీమలో వర్షాలు లేకపోయినప్పటికీ మేఘాలు ఉంటాయి. హైదరాబాద్ లో ట్రాఫిక్స్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాహనదారులు ముందుగానే ప్లాన్ చేసుకోవాలని ఐఎండీ తెలుపుతోంది.

ఇక తేమ మరోసారి పెరిగింది. తెలంగాణలో యావరేజ్‌గా 74 శాతం ఉండగా.. ఉత్తర తెలంగాణలో 80 శాతానికి పైగా ఉంది. అందుకే అక్కడ ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో తేమ యావరేజ్‌గా 69 శాతమే ఉన్నా.. కోస్తాంధ్రలో 71 శాతం, ఉత్తరాంధ్రలో 79 శాతం ఉంది. అందుకే అక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక బంగాళాఖాతంలో 23న ఏర్పడబోయే అల్పపీడనం చాలా పెద్దగా ఉండే అవకాశం ఉంది. ఇది ఉత్తరాంధ్ర, ఒడిశాపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 

Tags:    

Similar News