Zomato Cycle Delivery Boy: బీటెక్ డెలివరీ బాయ్ కి...బైక్ సాయం

Zomato Cycle Delivery Boy: సైకిల్ పై జోమాటో డెలివరీ బాయ్ అఖీల్ మమ్మద్ కు బైక్ సాయం చేసి ఆదుకున్నారు.

Update: 2021-06-19 06:49 GMT

Bike Gift to Food Delivery Boy

Zomato Cycle Delivery Boy: 20 నిముషాల్లో 9 కిలోమీటర్లు.. అది కూడా సైకిల్ మీద .. మీరు వెళ్లగలరా.. అది మన అఖీల్ మహ్మద్ కే సాధ్యం. ఫుడ్ వేడిగా ఉండగానే.. గమ్యస్థానం ఎంత దూరమైనా.. ఆ వేడి పార్శిల్ ను వేడివేడిగానే అందిస్తాడు మన అఖీల్ మహ్మద్. అది కూడా సైకిల్ మీదే. సైకిల్ మీదే కిలోమీటర్లకు కిలోమీటర్లు తిరిగేస్తూ.. జోమాటో డెలివరీ బాయ్ గా చేస్తున్న మన బీటెక్ బాబు మహ్మద్ సీన్.. ఒక డెలివరీతో టర్నింగ్ తీసుకుంది.

కింగ్ కోఠిలో ఉండే రాబిన్ ముఖేష్ ఓ ఆర్డర్ ఇచ్చాడు. దానిని లక్డీకపూల్ నుంచి రాత్రి 10 గంటలకు.. 12 నిముషాల్లో డెలివరీ చేశాడు... అదీ వర్షంలో. అయితే వర్షంలో తడిసి వచ్చిన మహ్మద్ ను చూసి ఆశ్చర్యపోలేదు రాబిన్ ముఖేష్.. అతడి సైకిల్ ని చూసి షాకయ్యారు. ఏంటీ సైకిల్ మీద ఇంత దూరం 12 నిముషాల్లో ఈ వర్షంలో వచ్చి డెలివరీ చేశావా అని అడిగాడు. అయితే తాను ఎప్పుడూ సైకిల్ మీదే డెలివరీ చేస్తానని... తప్పదు కదా.. నా కెపాసిటీకి అంటూ సమాధానమిచ్చాడు. అతడితో సెల్ఫీ తీసుకున్న ముఖేష్.. ది గ్రేట్ హైదరాబాద్ ఫుడ్ అండ్ ట్రావెల్ క్లబ్ లో పోస్టు చేశాడు. అతడికి సాయం చేయాలని కోరాడు. బైక్ కొనివ్వడానికి ఫండింగ్ రైజ్ చేయమని అడిగాడు. అంతే జస్ట్ 12 గంటల్లో 73 వేలు జమ అయ్యాయి. ఒక అమెరికన్ మహిళ 30 వేలు ఇవ్వడం హైలెట్. వెంటనే ఆ డబ్బులతో టీవీఎస్ ఎక్సెల్ బైక్, ఒక రెయిన్ కోటు, శానిటైజర్, మాస్కుల్ని అఖిల్ మహ్మద్ కి అందించారు క్లబ్ ప్రతినిధులు.

నాన్న చెప్పులు కుడతారు. నేను ఇంజనీరింగ్ చేస్తున్నా. కాని లాక్డౌన్ తో నాన్నకు పని లేకుండా పోయింది. అందుకే నేను సైకిల్ పై ఈ పని మొదలెట్టాను. రోజూ 10 డెలివరీలు చేస్తున్నాను. ఈ సాయం ఊహించలేదు.. నా కష్టాన్ని తీర్చారు.. ఇప్పుడు ఎక్కువ డెలివరీలు చేయొచ్చు.. ఎక్కువ సంపాదించొచ్చు.. రియల్లీ థ్యాంక్ యూ ఆల్ అంటూ కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు మహ్మద్.

Tags:    

Similar News