Telangana Elections 2023: మారని హైదరాబాదీల తీరు.. ఓటెయ్యడానికి కదలని నగరవాసులు
Telangana Elections 2023: మరికొద్ది నిమిషాల్లో ముగియనున్న పోలింగ్
Telangana Elections 2023: ఉన్నత చదువులు, లక్షల్లో జీతాలు.. కానీ ఏం లాభం ఓటేసేందుకు మాత్రం హైదరాబాద్ వాసులకు బద్దకం అడ్డొస్తోంది. ఐదేళ్లకు ఓ సారి జరిగే ఎన్నికలను హైదరాబాద్ వాసులు లైట్ తీసుకుంటున్నారు. ఎలక్షన్ హాలీడేను జాలీడేగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్నికలు అంత ముఖ్యం కాదంటూ ముఖం చాటేస్తున్నారు.
ఎప్పటిలాగే 11 గంటలకు లేచి సెలవు కదా అని మాల్స్,మల్టీప్లె్క్స్‌లకు వెళుతున్నారేగానీ... ఓటేసేందుకు హైదరాబాద్ ప్రజలను ఇంట్రెస్ట్ చూపించడం లేదు. సరైన నాయకుడి ఎన్నుకునే సామాజిక బాధ్యత నగర ఓటర్లలో కరువవుతోంది. అర్బన్ ప్రజలు ఓటేయాలని ఓ వైపు ఎన్నికల కమిషన్ నెత్తి నోరు బాదుకుంటుంటే.. మా ఓటుతో ఏం మారుతుందిలే అనుకుంటూ వెబ్ సిరీస్‌లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
అర్బన్ ఓటింగ్ తగ్గడం ఇదేం మొదటి సారి కాదు. ఎన్నికలు ఏవైనా మేం ఓట్లేయం అన్నట్లే ఉంటుంది హైదరాబాద్ ఓటర్ల తీరు. జరుగుతున్న ఓట్లతో మాకేం సంబంధం లేదన్నట్లు వ్యవహిస్తు్న్న తీరుపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఓటేసేందుకు బద్దకంగా కొందరు ఇంట్రెస్ట్ చూపించకపోతే.. లైన్‌లో వేచి ఉండటం ఇష్టం లేక మరికొందరు పోలింగ్ కేంద్రాలు వెళ్లడం లేదని తెలుస్తోంది.