Hyderabad Metro: డిసెంబర్ 31 అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు
Hyderabad Metro: రేపు మెట్రో రైళ్ళ సమయం పొడిగించారు అధికారులు.
Hyderabad Metro: రేపు మెట్రో రైళ్ళ సమయం పొడిగించారు అధికారులు. డిసెంబర్ 31 అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. మొదటి స్టేషన్ లో అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. చివరి స్టేషన్ చేరే వరకు అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు నడువనున్నాయి. నూతన సంవత్సర సందర్బంగా మద్యం సేవించి వాహనాలు నడపకుండా, డ్రంక్ డ్రైవ్లో పట్టుబడకుండా మెట్రో రైల్ సేవల సమయం పొడగించినట్టు అధికారులు వెల్లడించారు. తాగి మెట్రోలో తోటి ప్రయాణికులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని మెట్రో అధికారుల హెచ్చరించారు.