Hyderabad Metro Rail: 1.6 కి.మీ. సొరంగ మార్గం.. సెకండ్ ఫేజ్ విశేషాలివీ...

Hyderabad Metro Rail: హైద్రాబాద్ (Hyderabad) మెట్రో రైలు రెండో దశ పనులు 2025 జనవరిలో ప్రారంభం కానున్నాయి. పాతబస్తీలో సేకరించిన ఆస్తుల కూల్చివేత పనులు డిసెంబర్ లో చేపడుతారు. మెట్రో ఫస్ట్ ఫేజ్ 69 కి.మీ. మార్గంలో ప్రయాణీకులకు మెట్రో సేవలు అందుతున్నాయి. ఏడేళ్లలో 63 కోట్ల 40 లక్షల మంది ప్రయాణించారు. రెండోదశ పనులు పూర్తైతే నగరంలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి.

Update: 2024-11-27 14:04 GMT

హైద్రాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్: ఎక్కడి నుంచి ఎక్కడికి?

Hyderabad Metro Rail: హైద్రాబాద్ (Hyderabad) మెట్రో రైలు రెండో దశ పనులు 2025 జనవరిలో ప్రారంభం కానున్నాయి. పాతబస్తీలో సేకరించిన ఆస్తుల కూల్చివేత పనులు డిసెంబర్ లో చేపడుతారు. మెట్రో ఫస్ట్ ఫేజ్ 69 కి.మీ. మార్గంలో ప్రయాణీకులకు మెట్రో సేవలు అందుతున్నాయి. ఏడేళ్లలో 63 కోట్ల 40 లక్షల మంది ప్రయాణించారు. రెండోదశ పనులు పూర్తైతే నగరంలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి.

హైదరాబాద్ మెట్రో ఫస్ట్ ఫేజ్ కు ఏడేళ్లు పూర్తి

హైదరాబాద్ మెట్రో ఫస్ట్ ఫేజ్ పూర్తై ఏడేళ్లు అవుతోంది. 2017 నవంబర్ 29న నాగోల్- అమీర్ పేట మార్గంతో ఫస్ట్ ఫేజ్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఎల్ బీ నగర్ -అమీర్ పేట మార్గాన్ని 2018 అక్టోబర్ లో ప్రారంభించారు. అమీర్ పేట-హైటెక్ సిటీ మార్గాన్ని 2019 మార్చిలో స్టార్ట్ చేశారు. జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గం 2020 ఫిబ్రవరి 7న అందుబాటులోకి వచ్చింది. ఫస్ట్ ఫేజ్ లో 69 కి.మీ.రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ మెట్రో దేశంలోనే రెండో అతి పెద్ద మెట్రోగా గుర్తింపు పొందింది. ప్రారంభించిన రోజునే మెట్రోలో 2 లక్షల మంది ప్రయాణించారు. ప్రతి రోజూ సగటున 5 లక్షల మంది ప్రయాణీకులను తమ గమ్య స్థానాలకు మెట్రో రైలు చేరుస్తోంది. నగరంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణాను పెంచాల్సిన అవసరం ఉంది. దీంతో రెండో దశను ప్రారంభించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

హైద్రాబాద్ మెట్రో రెండో దశ

హైద్రాబాద్ నగరం విస్తరిస్తోంది. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణాను విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. నగరంలోని ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మెట్రో ను విస్తరించాలని భావిస్తోంది. అంతేకాదు నగర శివార్లకు కూడా మెట్రోను విస్తరించడం ద్వారా అభివృద్దిని పరుగులు పెట్టించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండో దశలో 116.4 కి.మీ. మెట్రో సేవలను విస్తరించనున్నారు. ఆరు కారిడార్లలో ఈ పనులు నిర్వహిస్తారు. ఐదు కారిడార్లలో పనులకు సంబంధించిన డీపీఆర్ ను సిద్దం చేసి కేంద్రానికి పంపారు. నాగోల్- శంషాబాద్ ఎయిర్ పోర్ట్, రాయదుర్గ్- కోకాపేట్, ఎంజీబీఎస్-చంద్రాయణగుట్ట, మియాపూర్ -పటాన్ చెరు, ఎల్ బీ నగర్- హయత్ నగర్ మార్గాల్లో మెట్రో విస్తరణ పనులు చేపడతారు. ఆరో కారిడార్ లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫోర్త్ సిటీ వరకు 40 కి.మీ. కూడా పనులు చేస్తారు. దీనికి సంబంధించిన సర్వే పనులు జరుగుతున్నాయి. రెండో దశలో 57 స్టేషన్లతో రూ. 22 వేల కోట్లతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని భావిస్తున్నారు.

పీపీపీ విధానంలో అతి పెద్ద ప్రాజెక్ట్

ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టే అతి పెద్ద ప్రాజెక్టుగా హైద్రాబాద్ మెట్రో రైలు రెండో దశ రికార్డ్ సృష్టించనుంది. తెలంగాణ ప్రభుత్వం రూ.2,970 కోట్లు, భారత ప్రభుత్వం రూ.1,204 కోట్లు,మిగిలిన రూ. 17,974 కోట్లను ఎల్ అండ్ టీ మెట్రో రైలు హైద్రాబాద్ లిమిటెడ్ భరించనుంది. రెండో దశ ప్రాజెక్టు పనులపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో తరచుగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. సిస్రా కన్సల్టెంట్ల ద్వారా ట్రాఫిక్, ట్రాన్స్ పోర్టేషన్ సర్వేలు నిర్వహించారు. సిస్టా ద్వారా 76.4 కి.మీ పొడవుతో ఐదు కారిడార్లకు డీపీఆర్ పూర్తైంది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో 1.6 కి.మీ. అండర్ గ్రౌండ్ మార్గం ఉంటుంది.

ఇతర ట్రాన్స్ పోర్టు మార్గాలతో అనుసంధానం

రెండో దశలో ఎంఎంటీఎస్, టీజీ ఆర్టీసీ, ర్యాపిడో వంటి వివిధ రకాల రవాణా మార్గాలతో అనుసంధానం చేయనున్నారు. ఎయిర్ పోర్టు లైన్ సగటు వేగం పెంచే అవకాశం ఉంది. సగటు వేగం గంటకు 35 కి.మీ. తొలుత మూడు కోచ్ ల రైళ్లు ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఆరు కోచ్ లకు పెంచనున్నారు. మొదటి దశలో పార్కింగ్, బస్ బేలు, వంటి వాటి కోసం అవసరమైన స్థలాన్ని సేకరించలేదు. రెండో దశలో ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెండో దశ పూర్తైతే ప్రతి రోజూ 10 లక్షల మంది ప్రయాణీకులను మెట్రో రైలు తమ గమ్యస్థానాలకు చేర్చనుంది.

Full View


Tags:    

Similar News