కల్వకుర్తి ప్రాజెక్టులో పంపులు పేలిపోవడానికి మానవ తప్పిదమే కారణం : టీపీసీసీ ఉత్తమ్

కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన పంపులు పేలిపోయాయని.. ఇందులో వేల కోట్ల రూపాయల నష్టానికి మానవ తప్పిదమే కారణం టీపీసీసీ అధ్యక్షుడు..

Update: 2020-10-17 09:06 GMT

కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన పంపులు పేలిపోయాయని.. ఇందులో వేల కోట్ల రూపాయల నష్టానికి మానవ తప్పిదమే కారణం టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 20 జూన్ 2016 లో నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం తుంగలో తొక్కిందని అన్నారు. కల్వకుర్తి పంప్ హౌస్ కు 400 మీటర్ల దూరంలోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తి పోతల పథకం అండర్ గ్రౌండ్ తవ్వకాలు చేస్తున్నారు.. అక్కడ బ్లాస్టింగ్ల వల్లనే ఇంత పెద్ద నష్టం జరిగిందని.. ఇందుకు పూర్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలని ఉత్తమ్ అన్నారు. 14 అంతస్తుల కల్వకుర్తి పంప్ హౌస్ లో 10 అంతస్తుల మేర నీటితో మునిగిపోయాయని ఆయన ఆరోపించారు.

ఇంత పెద్ద నష్టం కారణంగా రాబోయే రోజులలో ఆయకట్టుకు నీరు అందదని.. ఇదంతా కేసీఆర్ వల్లనే జరిగిందని ఉత్తమ్ ఆరోపించారు. ఈ తప్పిదానికి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. అలాగే ఇటు కాళేశ్వరం, మిడ్ మానేరు, కొండపోచమ్మ సాగర్ అన్ని ప్రాంతాలలో ప్రాజెక్టులకు గండ్లు పడ్డాయని.. ఇటీవలే శ్రీశైలం పంపు పెద్ద ఘోర ప్రమాదం జరిగిందని.. అది మరువక ముందే కల్వకుర్తి లో పంపు హౌస్ లో మోటర్లు పేలిపోయాయని.. అయితే ఇందులో మానవ నష్టం కొద్దిలో తప్పిపోయిందని అన్నారు. ఈ విషయంలో న్యాయ విచారణ పారదర్శకంగా చేసి దోషులను కఠినంగా శిక్షించాలని ఉత్తమ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News