Hyderabad: ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హోంగార్డు రవీందర్ మృతి
Hyderabad: మృతదేహం ఉస్మానియా ఆస్పత్రికి తరలింపు
Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన హోంగార్డు మృతి చెందాడు. DRDO హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ రవీందర్ మృతి చెందాడు. ప్రభుత్వం జీతాలు చెల్లించడంలేదనే మనస్తాపంతో నాలుగు రోజుల క్రితం ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఉస్మానియాలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం డీఆర్‌డీవోకు తరలించారు. అక్కడ వెంటిలేటర్‌పై చికిత్స అందించిన డాక్టర్లు పరిస్థితి విషమించిందని తెలిపారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. మరో వైపు రవీందర్‌కు మద్దతుగా హోంగార్డులు ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. రవీందర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.