Warangal: రోడ్డుపై తల్వార్ తిప్పుతూ హోంగార్డు హల్‌చల్.. కట్ చేస్తే...

Warangal: వరంగల్‌లో ఓ హోంగార్డు తల్వార్‌తో హల్చల్ చేశాడు. దీంతో స్థానికులతో పాటు దుకాణాదారులు భయాందోళనలకు గురయ్యారు.

Update: 2024-10-23 06:03 GMT

Warangal: రోడ్డుపై తల్వార్ తిప్పుతూ హోంగార్డు హల్‌చల్.. కట్ చేస్తే...

Warangal: వరంగల్‌లో ఓ హోంగార్డు తల్వార్‌తో హల్చల్ చేశాడు. దీంతో స్థానికులతో పాటు దుకాణాదారులు భయాందోళనలకు గురయ్యారు. ధర్మారం గ్రామానికి చెందిన సుకుమార్ ప్రస్తుతం కాశిబుగ్గలో ఉంటూ... వరంగల్ సబ్ డివిజన్ పరిధి ఇంతేజార్ గంజ్ పీఎస్ పరిధిలో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాశిబుగ్గ నుంచి ఓసిటీకి వెళ్లే కూడలిలో మద్యం మత్తులో తల్వార్ తిప్పుతూ హల్చల్ చేశాడు.

సమాచారం అందుకున్న పోలీసులు హోంగార్డును పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేశారు. అదే స్థానిక ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న సుకుమార్ మద్యం మత్తులో తల్వార్ చేతిలో పట్టుకుని కాశీబుగ్గలో, పెరుగు అమ్మే దుకాణాల ముందు తిరుగుతుండడం చూసి పోలీసులు కంగు తిన్నారు. పోలీసుశాఖలో విధులు నిర్వర్తిస్తూ బాధ్యతారహితంగా వ్యవహరించడంపై స్థానికులతో పాటు పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Full View


Tags:    

Similar News