తెలుగు రాష్ట్రాల్లో సూర్యప్రతాపం.. నేడు 43 మండలాల్లో తీవ్ర వడగాలులు

Weather Report: ఉక్కపోతతోపాటు పెరిగిన ఎండల తీవ్రత

Update: 2024-04-23 07:40 GMT

తెలుగు రాష్ట్రాల్లో సూర్యప్రతాపం.. నేడు 43 మండలాల్లో తీవ్ర వడగాలులు

Weather Report: ఏపీలో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. మరో ఐదు రోజుల పాటు ఎండలు తీవ్రంగా ఉండనున్నాయి. ఉక్కపోతతో పాటు ఎండల తీవ్రత పెరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. తెలంగాణలో వచ్చే 3 రోజులు తేలికపాటి వానలు కురవనున్నాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడనుందని వాతావరణశాఖ తెలిపింది.

దేశంలోని అనేక ప్రాంతాల్లో రాబోయే ఐదు రోజుల పాటు ఎండతోపాటు వేడిగాలులు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్‌లోని పలు ప్రాంతాల్లో వేడి పరిస్థితులు కొనసాగుతాయని వెల్లడించింది. గాలిలో అధిక తేమ కారణంగా కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కర్నాటక, గోవా, కేరళ, పశ్చిమబెంగాల్, బీహార్‌లలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని సూచించింది.

Tags:    

Similar News