Heavy Rains: మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు
Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని ఉపరిత ఆవర్తనం సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశగా కొనసాగుతుందని పేర్కొంది.
Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలకు అనుకుని ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 7.6కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశగా కొనసాగుతుందని పేర్కొంది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరో 3 రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కపల్లేలో అత్యధికంగా 9.12 సెంటిమీటర్లు, భద్రాచలంలో 7.33 సెంటీమీటర్ల, జూలూరుపాడులో 6.26 సెంటీమీటర్లు, చంద్రుగొండలో 6.15, కొత్తగూడెంలో 5.57, చుంచుపల్లిలో 5.32, అశ్వాపురంలో 5.51, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైన్ పూర్లో 5.74 , ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో 5.61, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో 6.72 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఈ ఏడాది జూన్ ముగిసేసరికే 159 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. సోమవారం ఆదిలాబాద్, పెద్దపల్లి, నల్లగొండ, సూర్యపేట, ఖమ్మం, భద్రాత్రి కొత్తగూడెం, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యల, మహబూబాబాద్, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే.