Heavy rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Heavy rains in Telangana, Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు పడనున్నాయి.

Update: 2024-08-08 04:00 GMT

 Heavy rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Heavy rains in Telugu States: తెలుగు రాష్ట్రాలకు మరోరెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ధ్రోణి ప్రభావంతో ఏపీ,తెలంగాణలో భారీ నుంచి అతిభారీవర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు హెచ్చరించింది. పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఈ ఆవర్తనం గ్యాంగ్టక్ పశ్చిమబెంగాల్ నుంచి ఝార్ఖండ్, ఉత్తర ఒడిశా దగ్గర సముద్ర మట్టానికి 5.8కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీక్రుతమైనట్లు తెలిపింది.

ఉత్తర, దక్షిణ రాయలసీమ నుంచి అంతర్గత తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఈ ద్రోణి ప్రభావం కొనసాగుతున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ ధ్రోణి ప్రభావం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆదిలాబాద్‌, కొమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబ్​నగర్‌, వనపర్తి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, సూర్యాపేట, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

అటు దక్షిణ కోస్తాలోనూ తేలికపాటి జల్లులు, రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

Tags:    

Similar News