Hyderabad Rain: హైదరాబాద్లో దంచికొట్టిన వాన..మూడు గంటలు ముంచెత్తిన వర్షం
Hyderabad Rain: హైదరాబాద్ నగరంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సాయంత్రం 6గంటలకు షురూ అయిన వర్షం కొన్ని ప్రాంతాల్లో 9గంటల వరకు పడింది. గరిష్టంగా బన్సీలాల్ పేటలో 8.75సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది.
Hyderabad Rain: హైదరాబాద్ లో గురువారం సాయంత్రం కుండపోత వర్షం పడింది. సాయంత్రం 6గంటల నుంచి మొదలైన వర్షం కొన్ని ప్రాంతాల్లో 9 గంటల వరకు కురిసింది. గరిష్టంగా బన్సీలాల్ పేటలో 8.75సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. కుండపోత వర్షంతో వందలాది కాలనీలు ముంపునకు గురయ్యాయి.
ఖైరతాబాద్, రాజ్ భవన్, అమీర్ పేట, మూసాపేట, కూకట్ పల్లి, మలక్ పేట, బంజారహిల్స్, పంజాగుట్టు, కేసీపీ జంక్షన్ రోడ్డు మార్గాలపై నడుములోతు వరకు నీరు చేరింది. సికింద్రాబాద్, ముషీరాబాద్, రాంనగర్ ప్రాంతాల వరద పద్మకాలనీ, బాగ్ లింగంపల్లిలోని పలు ప్రాంతాల్లో ముంచెత్తింది. ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి ఇందిరాపార్క్ వరకు రోడ్లన్నీ చెరువులను తలపించాయి.
నగర వ్యాప్తంగా ట్రాఫిక్ సమస్య ఇబ్బంది పెట్టింది. ఖాజాగూడు కూడలి, మల్కంచెరువు, బయోడైవర్సిటీ కూడలి, గచ్చిబౌలిలోని ప్రధాన రహదారులపై రాకపోకలు స్తంభించిపోయాయి. జూబ్లిహిల్స్ క్రుష్ణానగర్ రోడ్లను వరద నీరు ముంచెత్తింది. రోడ్లపై ఉన్న తోపుడు బండ్లు, ద్విచక్ర వాహనాలు, ఓ ఆటో వరదలో కొట్టుకుపోయాయి. ముషీరాబాద్ జాంబినర్గ, బాప్టిస్ట్ చర్చి, సూర్యనగర్, ప్రేయర్ చర్చి వీధిలోని ఇళ్లలోకి వరదనీరు చేరింది.