Kodada: వరదకు కొట్టుకువచ్చిన రెండు కార్లు.. కారులో మృతదేహం
Floods: సూర్యాపేట జిల్లా కోదాడలో భారీ వర్షం కురుస్తోంది. అయితే.. వరదకు రెండు కార్లు కొట్టుకురావడం.. స్థానికంగా కలకలం రేపుతోంది.
Floods: సూర్యాపేట జిల్లా కోదాడలో భారీ వర్షం కురుస్తోంది. అయితే.. వరదకు రెండు కార్లు కొట్టుకురావడం.. స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానికులు జేసీబీల సాయంతో వరదలో నుంచి రెండు కార్లను వెలికితీశారు. కాగా.. కారులో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు గాంధీనగర్‌కు చెందిన నాగం రవిగా గుర్తించారు.
లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్‌కు వెళ్లే జాతీయ రహదారిపై వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.