Rythu Bheema: రైతు బీమా రూ. 5లక్షల స్కీమ్‌కు అప్లయ్ చేసుకున్నారా?లేదంటే ఇలా దరఖాస్తు చేసుకోండి
Rythu Bheema: రైతులకు ముఖ్య సమాచారం. రూ. 5లక్షల బెనిఫిట్స్ అందించే స్కీముకు మీరు దరఖాస్తు చేసుకున్నారా. లేదంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఇలా దరఖాస్తు చేసుకోండి. ఎలాంటి పత్రాలు కావాలో చూద్దాం.
Rythu Bheema: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే రుణమాఫీ అమలు చేయగా..ఇప్పుడు అన్నదాతలకు అండగా నిలించేందుకు మరో కార్యక్రమానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రతి రైతుకు రూ. 5లక్షల జీవిత బీమా ప్రయోజనం ఉంది. చాలా మంది ఇప్పటికే ఈ పథకంలో చేరారు. అయితే ఈ మధ్యకాలంలో భూములు కొనుగోలు చేసివారు ఈ పథకం ప్రయోజనాలు పొందకపోవచ్చు. అంతేకాదు వారసత్వంగా వచ్చిన భూములు పొందినవారికి ఈ ప్రయోజనాలు అందకపోవచ్చు. అంటే కొత్తగా పాస్ బుక్ లు పొందినవారు రైతు బీమా పథకంలో చేరకపోవచ్చు.
అలాంటివారికి రేవంత్ రెడ్డిప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 2024 జులై 28లోపు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పొందేవారికి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అందుకే ఇలాంటి రైతులు బీమా కోసం ఈ పథకంలో చేరవచ్చు. 2024 ఆగస్టు 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అందించే బీమా సౌకర్యం లేని రైతు కూడా దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. మీరు ఈ స్కీముకు అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి.
అర్హత ఉన్న రైతులు వ్యవసాయ అధికారులను సంప్రదించాలి. వారి నుంచి దరఖాస్తు ఫారం తీసుకుని నింపాలి. పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ లు దరఖాస్తుకు జత చేయాలి. అంతేకాదు నామినీ ఆధార్ కార్డు జిరాక్స్ కూడా ఇవ్వాలి. ఈ స్కీములో పట్టాదారు రైతు మరణిస్తే రూ. 5లక్షల బీమా మొత్తం అందుుంది. రైతు కుటుంబానికి ఈ డబ్బులను చెల్లిస్తారు. నామినీకి 10రోజుల్లోపు డబ్బులు ఇస్తారు. 18ఏండ్ల నిండిన యువ రైతుల నుంచి 59ఏండ్ల నిండిన రైతులు ఈ పథకంలో చేరేందుకు అర్హులు.