హోంగార్డు గోపాల్ ను పరామర్శించిన హరీష్ రావు

మల్కాపూర్ చెరువు కూల్చివేతలో గాయపడిన హోంగార్డ్

Update: 2024-10-01 08:43 GMT

హోంగార్డు గోపాల్ ను పరామర్శించిన హరీష్ రావు

సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో కూల్చివేతలో తీవ్రంగా గాయపడి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హోంగార్డ్ గోపాల్ ను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ప్రమాదం జరిగి హోంగార్డు గాయపడితే ఒక్క పోలీస్ ఉన్నతాధికారి కూడా పరామర్శించలేదన్నారు.ప్రమాదకరమైన డిటోనెటర్లతో పేలుళ్లు చేసినప్పుడు కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతోనే గోపాల్ ప్రమాదానికి గురయ్యాడన్నారు. ప్రమాదానికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

ప్రభుత్వం వైద్య ఖర్చులు భరించడం లేదన్నారు. ప్రభుత్వం నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని హోంగార్డు గోపాల్ కుటుంబ సభ్యులు హరీష్ రావు దృష్టికి తీసుకు వెళ్లారు. గోపాల్ ను పరామర్శించిన వారిలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఉన్నారు.

Tags:    

Similar News