Harish Rao: మెదక్‌ను జిల్లా చేసిన ఘనత కేసీఆర్‌దే
Harish Rao: ఏడుపాయల దుర్గమ్మకు కేటాయించిన రూ. 100 కోట్లు కేటాయిస్తే.. ఆ నిధులు వెనక్కి తీసుకున్నారు.. దుర్గమ్మ ఉసురు తగులుతుంది
Harish Rao: మెదక్ జిల్లాను చేసిన ఘనత కేసీఆర్‌దేనని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించారు. మెదక్‌కు సీఎం రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఏడుపాయల దుర్గమ్మకు కేటాయించిన 100 కోట్లను వెనక్కి తీసుకుని.. ఆలయ అభివృద్ధికి అడ్డంపడ్డారని ధ్వజమెత్తారు. మెదక్‌కు రైల్వే మార్గం తీసుకున్న ఘనత .. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీదేనని హరీష్ రావు అన్నారు.