Harish Rao: కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మార్చాడు
Harish Rao: విద్యుత్‌పై కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు
Harish Rao: రైతులకు విద్యుత్‌పై కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి హరీష్‌రావు అన్నారు. సీఎం కెసిఆర్ వచ్చిన తరువాత వ్యవసాయాన్ని పండగలా మార్చాడని హరీష్ రావు అన్నారు. రెండు పంటలు పండే ఆకుపచ్చని మాగానిగా చేశాడని చెప్పారు. కెసిఆర్ రైతు బంధు ఇస్తుంటే బిచ్చం ఇస్తుండు అని రేవంత్ రెడ్డి రైతులను అవమానించాడని అన్నారు.
జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి మద్దతుగా ఆయన రోడ్ షో నిర్వహించారు. కార్యక్రమంలో టిఎస్ఆర్టిసి ఛైర్మెన్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రాజయ్య పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.