Harish Rao: దసరాలోపు రైతులకు రుణమాఫీ చేయాలి.. ప్రభుత్వానికి హరీష్ రావు మరో డెడ్ లైన్..
Harish Rao: లేదంటే రైతులందరితో కలిసి సచివాలయం ముట్టడిస్తామని హెచ్చరిక..
Harish Rao: దసరా పండుగలోపు అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వానికి డెడ్‌లైన్ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా నంగునూరులో రుణమాఫీ కోసం అన్నదాతలు చేపట్టిన దీక్షలో పాల్గొన్న హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతులకు రుణమాఫీ చేసే వరకు సీఎం రేవంత్‌రెడ్డిని నిద్రపోనివ్వనన్నారు.
బీఆర్‌ఎస్ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందన్నారు. దసరా లోపు రుణమాఫీ చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా రైతులతో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. రైతు రుణమాఫీ పేరుతో అన్నదాతలకు మాయమాటలు చెప్పారు.