Harish Rao: సీతక్కది పని తక్కువ ప్రచారం ఎక్కువ
Harish Rao: తెలంగాణ వచ్చాకే ములుగు జిల్లా అభివృద్ధి చెందింది
Harish Rao: ఓట్లు రావడంతోనే బీజేపీకి ఎస్సీ వర్గీకరణ గుర్తుకు వచ్చిందని మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. ఈ ఐదేళ్లలో ఎస్సీ వర్గీకరణ, గిరిజన యూనివర్సిటీ, రైల్వో కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు గుర్తుకు రాలేదని మంత్రి ప్రశ్నించారు. ములుగు నుంచి బీఆర్ఎస్‌లో చేరిన పలువురు నేతలకు తెలంగాణ భవన్‌లో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీతక్కది పని తక్కువ ప్రచారం ఎక్కువని ఎద్దేవా చేశారు హరీష్‌రావు.
తెలంగాణ వచ్చాకే ములుగు జిల్లా అభివృద్ధి చెందిందన్నారు. ఈ సారి సీతక్క ఓటమి ఖాయమని హరీష్ రావు జోస్యం చెప్పారు. కేసీఆర్ పాలనలో పల్లెల్లో కరువు లేదు, హైదారాబాద్‌లో కర్ఫ్యూ లేదన్నారు. 5 గంటల కరెంట్ ప్రచారంతో కాంగ్రెస్ అభాసుపాలైందన్నారు. వ్యవసాయానికి ఎంత hp మోటార్ వాడతారో తెలియని అజ్ఞాని రేవంత్ రెడ్డి అంటూ హరీష రావు విమర్శలు గుప్పించారు.