Harish Rao: రైతులు ఆలోచించి ఓటు వేయాలి
Harish Rao: కాంగ్రెస్‌కు ఓటేస్తే బాధపడాల్సి వస్తుంది
Harish Rao: ఆంథోల్‌లో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశానికి మంత్రి హరీశ్‌రావు హాజరైయ్యారు. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే పింఛన్‌ను పెంచుతామన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే గోస తప్పదని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కరెంట్ కష్టాలు వస్తాయని హరీశ్ రావు వివరించారు. కరెంట్ కష్టాలకు కర్ణాటక రాష్ట్రమే ఉదాహరణ అని చెప్పారు. కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నామని డీకే శివకుమార్ గొప్పలు చెబుతున్నారని.. 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రంలో 5 గంటల కరెంటు ఇస్తున్నామని చెప్పడం హాస్యాస్పదం అని ఎద్దేవా చేశారు. రైతులు ఆలోచించి ఓటు వేయాలని హరీశ్ రావు కోరారు.