Seethakka: డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్‌తో ఆవాసాలకు అనుసంధానం చేయాలి

Seethakka: అన్ని ఆవాసాలకు రక్షిత మంచి నీరు అందించేలా చర్యలు చేపట్టాలి

Update: 2024-07-06 14:46 GMT

Seethakka: డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్‌తో ఆవాసాలకు అనుసంధానం చేయాలి

Seethakka:  తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్‌తో అన్ని ఆవాసాలను అనుసంధానం చేయాలని మంత్రి సీతక్క కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డు సమావేశం మంత్రి సీతక్క అధ్యక్షతన జరిగింది. అన్ని ఆవాసాలకు రక్షిత మంచి నీరు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. అడవుల్లో నివసించే ప్రజలకు సైతం కుళాయి నీళ్లు అందించాలని ఆదేశించారు. అడవుల్లో విద్యుత్ లైన్లు వేసేందుకు కేంద్ర అటవీ శాఖ అనుమతులు ఇవ్వడం లేదని, అడవుల్లో ఉన్న ఆవాసాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి బోర్ల ద్వారా తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని ఆదేశించారు. నీటి సోర్స్ పాయింట్లు దగ్గరలో ఉండేలా చూసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీల్లో ఓవర్ హెడ్ ట్యాంకులను ప్రతి 15 రోజులకు శుభ్ర పరచాలని సూచించారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న తాగునీటినీ వినియోగించే విధంగా ప్రజలకు నమ్మకం కలిగించాలని అధికారులకు మంత్రి సీతక్క ఆదేశించారు.

Tags:    

Similar News