Singareni employees: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్..ఉద్యోగులకు బోనస్ ఎంతంటే...

Singareni employees:సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2023-24 ఏడాదిలో సింగరేణి సంస్థకు రూ. 4,701 కోట్లు లాభాలు రాగా..అందులో నుంచి 33శాతం లాభాలను బోనస్ గా ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో ఒక్కో సింగరేణి కార్మికుడికి సగటున రూ. 1.90 లక్షలు బోనస్ గా అందించనుంది.

Update: 2024-09-21 02:39 GMT

Singareni employees: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్..ఉద్యోగులకు బోనస్ ఎంతంటే...

Singareni employees: సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2023-24 ఏడాదిలో సింగరేణి సంస్థకు రూ. 4,701 కోట్లు లాభాలు రాగా..అందులో నుంచి 33శాతం లాభాలను బోనస్ గా ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో ఒక్కో సింగరేణి కార్మికుడికి సగటున రూ. 1.90 లక్షలు బోనస్ గా అందించనుంది.

సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. సింగరేణి కార్మికుల బోనస్ కు రూ. 796 కోట్లు ప్రకటించింది. అందులో ఒక్కో కార్మికుడికి సగటున రూ. 1.90లక్షల బోనస్ అందించనుంది. గత ఏడాది కంటే రూ. 20వేలు అదనంగా సింగరేణి కార్మికులకు బోనస్ గా అందించనుంది.

అలాగే సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా ఒప్పంద ఉద్యోగులకూ బోనస్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒప్పంద కార్మికులు ఒక్కొక్కరికీ రూ. 5వేలు బోనస్ గా ఇవ్వనుంది. 2023-24 ఏడాదిలో సింగరేణి లాభం రూ. 4,701 కోట్లు కాగా, ఆ లాభాల్లో 33శాతాన్ని ప్రభుత్వం బోనస్ గా ప్రకటించింది.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. 2023-24 ఏడాదిలో సింగరేణి లాభం రూ. 4,701 కోట్లు వచ్చింది. ఇప్పుడు సింగరేణి కార్మికులకు సంతోషంగా బోనస్ ప్రకటిస్తున్నాము. సింగరేణి కార్మికులకు రూ. 796కోట్లును బోనస్ గా ప్రకటిస్తున్నాము.ఒక్కో కార్మికుడికి సగటున రూ. 1.90లక్షలు బోనస్ గా వస్తుంది.

సింగరేనిలో శాశ్వత ఉద్యోగులు 41,837 సింగరేణిలో ఒప్పంద ఉద్యోగులకు కూడా బోనస్ ఇవ్వాలని డిసైజ్ అయ్యాం. సింగరేణి ఒప్పంద ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ. 5వేల బోనస్ ఇవ్వనున్నాము. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా ఒప్పంద ఉద్యోగులకు బోనస్ ఇస్తున్నామని తెలిపారు.


Tags:    

Similar News