జీఎచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ అగ్రస్థానంలో ఉండగా.. టీఆర్‌ఎస్‌పార్టీ రెండో స్థానంలో నిలిచింది. జీఎచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఆర్సీ పురం, పటాన్ చెరు, హఫీజ్‌పేట, హైదర్‌నగర్, చందానగర్ డివిజన్‌లో కారు ముందంజలో ఉంది. మరికాసేపట్లో తొలి రౌండ్ ఫలితాలు పూర్తి స్థాయిలో వెలువడనున్నాయి.