BJP: తెలంగాణ బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల
BJP: 12 మందితో 4వ జాబితా విడుదల
BJP: బీజేపీ అసెంబ్లీ అభ్యర్ధుల నాలుగో జాబితాను విడుదల చేసింది. 12మందితో నాలుగో జాబితాను విడుదల చేసింది. చెన్నూరు స్థానాన్ని దుర్గం అశోక్ కి, ఎల్లారెడ్డి సీటును వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి కేటాయించారు. వికారాబాద్ స్థానం పెద్దిరెడ్డి నవీన్ కుమారికి, సిద్దిపేట సీటు దూడి శ్రీకాంత్ రెడ్డికి దక్కాయి. కొడంగల్ నుంచి బంటు రమేష్ కుమార్, గద్వాల నుంచి బోయ శివ, వేములవాడ నుంచి తుల ఉమను బరిలోకి దించుతున్నారు. మునుగోడు స్థానం చల్లమల్ల కృష్ణారెడ్డికి, మిర్యాలగూడ సీటు సాదినేని శ్రీనివాస్ కు, హుస్నాబాద్ సీటుని బొమ్మా శ్రీరామ్ చక్రవర్తికి కేటాయించారు. నకిరేకల్ నుంచి నకరకంటి మెుగలయ్య, ములుగు నుంచి ప్రహ్లాద్ నాయక్ ను ప్రకటించారు.
ఇప్పటి వరకు బీజేపీ మొత్తం 100 మంది అభ్యర్దులను ప్రకటించింది. ఇప్పటికే బీజేపీ 88 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పడు తాజాగా 12 మందితో నాలుగో జాబితాను విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగాను.. 100 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. నామినేషన్ల దాఖలుకు ఇంకా మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో మిగిలిన అభ్యర్థులను కూడా రేపు ప్రకటించే అవకాశం ఉంది.