Formula-E Race: హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేస్ రద్దు
Formula-E Race: ఈవీ ఔత్సాహికులు, కేసీఆర్ ప్రభుత్వం వారంపాటు కష్టపడింది
Formula-E Race: హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్ రద్దు అయింది. ఫార్ములా ఈ రేస్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహక సంస్థ ఎఫ్‌ఐఏ సంస్థ ప్రకటించింది. ఫిబ్రవరి 10న ఈ ప్రిక్స్ ఈవెంట్ హుస్సేన్‌సాగర్ సమీపంలో జరగాల్సి ఉంది. హైదరాబాద్‌కు బదులు మెక్సికో సిటీలో ఈ రేస్ నిర్వహించనున్నారు. ఫార్ములా ఈ రేస్ రద్దుపై ఎక్స్‌లో కేటీఆర్ స్పందించారు. ఇది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన, తిరోగమనినిర్ణయమని పేర్కొన్నారు. ఈ ప్రిక్స్ వంటి ఈవెంట్‌లు ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్, దేశం ఇమేజ్‌ను పెంచుతాయని తెలిపారు. హైదరాబాద్‌ను పెట్టుబడు గమ్యస్థానంగా ప్రదర్శించడానికి ఈవీ ఔత్సాహికులు, కేసీఆర్ ప్రభుత్వం వారంపాటు కష్టపడిందన్నారు కేటీఆర్.