కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే
గ్రేటర్ ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, శేరిలింగంపల్లి ఇంచార్జ్ రవికుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
గ్రేటర్ ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, శేరిలింగంపల్లి ఇంచార్జ్ రవికుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తమ అనుచరులతో కలిసి ఈ రోజు బీజేపీలో చేరే అవకాశం ఉంది. బిక్షపతి యాదవ్, రవికుమార్ యాదవ్ ను బుజ్జగించేందుకు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఇతర కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. అటు మాజీ మేయర్ బండా కార్తీక రెడ్డి నేడు బీజేపీలో చేరనున్న సంగతి తెలిసిందే.
ఇక ఇప్పటికే గ్రేటర్ ఎన్నికలకి షెడ్యుల్ వచ్చేసింది. డిసెంబర్ 01 న పోలింగ్ జరగనుండగా, 04 న కౌంటింగ్ జరగనుంది. అవసరమైన చోట డిసెంబర్ 03 న రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం ఏడూ గంటల నుంచి సాయింత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ విషయాన్నీ ఎన్నికల కమిషినర్ పార్థసారథి నిన్న జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇక ఈ ఎన్నికలను బ్యాలెట్ పద్దతిలోనే జరగనున్నట్టుగా అయన వెల్లడించారు. అటు నేటినుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుండగా, 20 న నామినేషన్ల స్వీకరణకి చివరి తేది కానుంది.